స్త్రీ, శిశు సంక్షేమశాఖ రాష్ట్ర కార్యాలయంలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-07-06T02:01:42+05:30 IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. 15రోజుల్లోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింపయింది

స్త్రీ, శిశు సంక్షేమశాఖ రాష్ట్ర కార్యాలయంలో కరోనా కలకలం

గుంటూరు: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. 15రోజుల్లోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింపయింది. ఆదివారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ రాష్ట్ర కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. కార్యాలయంలో 33 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. కార్యాలయాన్ని తాత్కాలింగా మూసివేయాలని అధికారుల నిర్ణయం తీసుకున్నారు. 


మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి వీధిలో నుంచి నట్టింట్లోకి వచ్చేసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఒకేరోజు పది కేసులు నమోదవడం కొవిడ్‌ వ్యాప్తి తీవ్రతకు నిదర్శనం. లాక్‌డౌన్‌లో స్వీయ జాగ్రత్తలు పాటించకపోవడం, అన్‌లాక్‌ మొదలుపెట్టిన తర్వాత కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు ఆచరణాత్మకంగా లేకపోవడంతో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి.

Updated Date - 2020-07-06T02:01:42+05:30 IST