ఏపీలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ యువకుడు డిశ్చార్జ్

ABN , First Publish Date - 2020-03-24T00:21:23+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదట కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు...

ఏపీలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ యువకుడు డిశ్చార్జ్

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదట కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటలీలో ఎంఎస్ చదువుతున్న యువకుడు గత వారం నెల్లూరుకు వచ్చాడు. అయితే ఆ కుర్రాడికి టెస్ట్‌లు చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆ యువకుడ్ని ఈ నెల 9న ప్రొఫెసర్ నరేంద్ర బృందం చికిత్స చేసింది. చికిత్స అనంతరం మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా తాజాగా నెగిటివ్ అని రావడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.


కాగా.. ఈ యువకుడ్ని మరో 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచి మరోసారి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-03-24T00:21:23+05:30 IST