ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-14T17:40:13+05:30 IST

ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా 34 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న సాయంత్రం నుంచి నేటి ఉదయం 9 గంటల వరకు 34 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 473కు చేరింది. తాజాగా గుంటూరులో 16, క‌ృష్ణాలో 8, కర్నూల్‌లో 7, అనంతపురంలో 2, నెల్లూరులో ఒక కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో అత్యధికంగా 109 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేసస్తోంది. గత 24 గంటల్లో 2010 శాంపిల్స్‌ను పరీక్షించగా 41 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌తో 9 మంది మృతి చెందగా...కరోనా బారిన పడి చికిత్స పొందుతూ కోలుకుని 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

Updated Date - 2020-04-14T17:40:13+05:30 IST