-
-
Home » Andhra Pradesh » Corona positive Shilpa Mohanreddy
-
శిల్పా మోహన్‌రెడ్డికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-12-27T22:12:05+05:30 IST
మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. కొన్ని రోజులుగా మోహన్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు కరోనా లక్షణాలు

కర్నూలు: మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. కొన్ని రోజులుగా మోహన్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే తనను కలిసినవారందరూ పరీక్షలు చేయించుకోవాలని శిల్పా మోహన్‌రెడ్డి కోరారు. మరోవైపు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. తొలి విడతలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు, నర్సులు, అనుబంధ విభాగాల సిబ్బందికి టీకా వేస్తారు. రెండో విడతలో పోలీసు శాఖ, పురపాలక సంఘాల్లోని ప్రజారోగ్య విభాగానికి చెందిన పారిశుధ్య కార్మికులకు, మూడో విడతలో వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్లలోపున్న వారికి వ్యాక్సిన్ అందనుంది. దీనికోసం వైద్యులు, సిబ్బందితో కలిపి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నారు.