బాపట్లలో కరోనా బాధితుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-08-17T03:25:48+05:30 IST
బాపట్ల పట్టణం అప్పికట్లలో విషాదం నెలకొంది. ఓ కరోనా బాధితుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహానికి

గుంటూరు: బాపట్ల పట్టణం అప్పికట్లలో విషాదం నెలకొంది. ఓ కరోనా బాధితుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా భయంతోనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.