కృష్ణా: లారీ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-04-28T16:04:27+05:30 IST
కృష్ణా: లారీ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్

కృష్ణా: జిల్లాలోని గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో ఓ లారీ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మూడు రోజుల క్రితం గోవాటి నుంచి సూరంపల్లి గ్రామానికి చేరుకున్నాడు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లగా...వైద్య సిబ్బంది అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో లారీ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్య అధికారులు వెల్లడించారు.