ఉరవకొండలో ఇద్దరు వలస కార్మికులకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-05-10T00:20:25+05:30 IST

కరోనా విజృంభిస్తుండటంతో జిల్లా ప్రజలు కలవరపడుతున్నారు. కేసులు తగ్గుముఖం పట్టాయనుకుంటున్న సమయంలో జిల్లాలో కరోనా పడగ విప్పుతోంది. ఉరవకొండలో ఇద్దరు వలస కార్మికులకు కరోనా సోకింది.

ఉరవకొండలో ఇద్దరు వలస కార్మికులకు కరోనా పాజిటివ్

అనంతపురం: కరోనా విజృంభిస్తుండటంతో జిల్లా ప్రజలు కలవరపడుతున్నారు. కేసులు తగ్గుముఖం పట్టాయనుకుంటున్న సమయంలో జిల్లాలో కరోనా పడగ విప్పుతోంది. ఉరవకొండలో ఇద్దరు వలస కార్మికులకు కరోనా సోకింది. విడపనకల్లు మండలం వి.కొత్తకోటకు చెందిన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారించారు. కరోనా బాధితులు వలస కూలీలతో కలిసి ముంబైకి వెళ్లొచ్చినట్లు గుర్తించారు. వీరిద్దరిని ఉరవకొండ క్వారంటైన్ నుంచి అనంతపురం సవేరా ఆస్పత్రికి తరలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం జిల్లాలో ఒకేసారి 16 కేసులు నమోదు కావడం అందరికి ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో హిందూపురం, అనంతపురం నగరాలు కరోనాకు కేరాఫ్‌గా మారిపోయాయి. 

Updated Date - 2020-05-10T00:20:25+05:30 IST