ఏపీలో 87కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-01T17:10:27+05:30 IST

అమరావతి: నిన్నటి వరకూ కరోనా ప్రభావం పెద్దగా కనిపించని ఏపీకి ఢిల్లీ మత సమావేశం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

ఏపీలో 87కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి: నిన్నటి వరకూ కరోనా ప్రభావం పెద్దగా కనిపించని ఏపీకి ఢిల్లీ మత సమావేశం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. నిన్నటి నుంచి ఢిల్లీలో జరిగిన మత సమావేశానికి వెళ్లొచ్చిన వారిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 87కు చేరుకున్నాయి. గత రాత్రి 9 గంటల నుంచి నేటి ఉదయం 9 గంటల వరకూ 43 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.


373 మందికి పరీక్షలు నిర్వహించగా 43 మందికి పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. మిగిలిన 330 కేసులు నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. కొత్తగా నేడు అత్యధికంగా కడపలో 15 కేసులు నమోదయ్యాయి. అలాగే పశ్చిమ గోదావరిలో 13 కేసులు, చిత్తూరులో 5, ప్రకాశం 4, నెల్లూరు 2, తూర్పు గోదావరిలో 2, కృష్ణా 1, విశాఖ 1 కేసు.. మొత్తంగా నేడు ఒక్కరోజే 43 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి ఏపీలో నలుగురు కరోనా నుంచి కోలుకున్నట్టు అధికారులు వెల్లడించారు.


Updated Date - 2020-04-01T17:10:27+05:30 IST