బ్రేకింగ్: విజయవాడలో తొలి కరోనా పాజిటివ్ కేసు

ABN , First Publish Date - 2020-03-22T03:43:34+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ తెలుగు రాష్ట్రాలకూ పాకింది...

బ్రేకింగ్: విజయవాడలో తొలి కరోనా పాజిటివ్ కేసు

విజయవాడ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ తెలుగు రాష్ట్రాలకూ పాకింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. తాజాగా విజయవాడ నగరంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఆ యువకుడు వన్‌టౌన్‌లో నివాసం ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. పారిస్‌లో ఎమ్మెస్సీ చదువుతున్న యువకుడు వారం రోజుల క్రితం స్వస్థలానికి వచ్చాడు. ఇంట్లో తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి తిరిగాడు.


కాగా.. విదేశాల నుంచి వచ్చిన వారి జాబితా ఆధారంగా యువకుడ్ని గుర్తించి.. శనివారం నాడు అధికారులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేయగా శనివారం రాత్రికి కరోనా పాజిటివ్ అని రిపోర్టుల్లో తేలింది. దీంతో ఆ యువకుడి కుటుంబ సభ్యులకు కూడా‌ వైద్య పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు.


అయితే.. కుటుంబ సభ్యులతో కాకుండా ఇంకా ఎవరెవర్ని ఆ యువకుడు కలిశాడు..? పారిస్ నుంచి ఈ యువకుడితో ఏపీకి ఇంకా ఎవరెవరు వచ్చారు..? అని జిల్లా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-03-22T03:43:34+05:30 IST