ఐసోలేషన్‌లో భర్త.. నడిరోడ్డుపై భార్య

ABN , First Publish Date - 2020-07-19T23:27:17+05:30 IST

జిల్లాలో బాధితుల సంఖ్య రోజుకు రోజుకు పెరిగిపోతోంది. కోవిడ్ సెంటర్లలో బెడ్స్ చాలడం లేదు. బాధితులకి..

ఐసోలేషన్‌లో భర్త.. నడిరోడ్డుపై భార్య

నెల్లూరు: జిల్లాలో బాధితుల సంఖ్య రోజుకు రోజుకు పెరిగిపోతోంది. కోవిడ్ సెంటర్లలో బెడ్స్ చాలడం లేదు. బాధితులకి నో వేకన్సీ పేరుతో వెళ్లిపోమని చెబుతున్నారు. అలా ఎంతో మంది రోడ్డున పడుతున్నారు. అలాంటి ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. భార్యభర్తలిద్దరూ పిల్లలు పంపే డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. భర్తకి కరోనా పాజిటివ్ రాగా ఐసోలేషన్‌లో ఉన్నారు. భార్యకు కూడా పాజిటివ్ అని తేలడంతో అద్దింటివారు వెళ్లిపోమన్నారు. అత్తంటికి వెళ్తే ఆమె వయసు రీత్యా ఇంట్లోకి రానివ్వలేదు. అర్ధరాత్రి వేళ ఆస్పత్రికి వెళ్తే బెడ్లు లేవన్నారు. చేర్చుకోవాలని బతిమిలాడినా కనికరం చూపించలేదు. దాంతో మూడు రోజులుగా అత్తింటి వద్ద ఇంటిముందే కాలం వెళ్లదీస్తోంది. అంబులెన్స్ పంపండి. ఆస్పత్రిలో చేర్చుకోండని వేడుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కనీసం ఎవరూ మందులు కూడా ఇవ్వలేదు. విషయం తెలిసిన వెంటనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బృందం అక్కడికి చేరుకుంది. బాధితురాలి తన ఆవేదనంతా తెలిపింది. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోన్ చేయగా వివరాలు పంపండి వెంటనే యాక్షన్ తీసుకుంటామని సమాధానమిచ్చారు. ఆమెను ఎప్పటికి ఆస్పత్రిలో చేర్చుకుంటారో అర్థంకాని పరిస్థితి కొనసాగుతోంది. Updated Date - 2020-07-19T23:27:17+05:30 IST