జనరల్‌ వార్డులో కరోనా రోగి

ABN , First Publish Date - 2020-06-21T09:27:55+05:30 IST

జీజీహెచ్‌లో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేకవార్డు ఉంది. కానీ, లక్షణాలు ఉన్న ఓ వ్యక్తిని ఈ వార్డులో ..

జనరల్‌ వార్డులో కరోనా రోగి

వైరస్‌ లక్షణాలతో వచ్చిన 3 రోజులకు పాజిటివ్‌ నిర్ధారణ

అప్పటిదాకా సాధారణ రోగుల మధ్యే

జీజీహెచ్‌లో నిర్వాహకుల నిర్వాకం


గుంటూరు (సంగడిగుంట), జూన్‌ 20 : జీజీహెచ్‌లో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేకవార్డు ఉంది. కానీ, లక్షణాలు ఉన్న ఓ వ్యక్తిని ఈ వార్డులో కాకుండా.. సాధారణ రోగులవార్డులో ఉంచిన ఉదంతం శనివారం చోటు చేసుకొంది.. నాలుగురోజులక్రితం కరోనా లక్ష ణాలతో 60ఏళ్ల వ్యక్తి జీజీహెచ్‌కు వచ్చారు. ఆయనకు పరీక్షలు చేసి ..ఫలితాలు వచ్చేవరకు సాధారణవార్డులో బెడ్‌ కేటాయిం చారు. ఆయన బెడ్‌కు ఆరడుగుల దూరంలోనే ఆరు బెడ్లు ఉన్నాయి. ఈ వార్డులో 30 బెడ్లు , వాటిపై రోగులు, వారి కోసం వచ్చిన బంధువులు.. ఇలా మొత్తం 300 మంది ఉన్నా రు. ఇలా మూడు రోజులు జరిగిన తర్వాత శుక్రవారం సా యంత్రం ఆయనకు పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది.


ఆ వెంటనే చడీచప్పుడు కాకుండా కరోనా వార్డుకు ఆయనను తరలిం చారు. కానీ, ఇన్నాళ్లు ఆయన ఉన్న వార్డులోని రోగులను అప్రమత్తం చేయలేదు. దీంతో..ఖాళీగా ఉంది కదా అని ఆబెడ్‌పై కొందరు రోగుల బంధువులు విశ్రాంతి తీసుకు న్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు, అంటే ఆవ్యక్తిని తరలించిన 24గంటలకు, సిబ్బంది వచ్చి విషయం చెప్పేసరి కి.. జనరల్‌ వార్డులోని అందరూ కంగారు పడిపోయారు! అప్పటికప్పుడు ఆ బెడ్‌ను సిబ్బంది శానిటైజ్‌ చేశారు.

Updated Date - 2020-06-21T09:27:55+05:30 IST