కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి: ఎమ్మెల్యే చెట్టి
ABN , First Publish Date - 2020-04-01T17:04:06+05:30 IST
అరకులోయ ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ..

విశాఖ: అరకులోయ ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇళ్లకే పరిమితం అవ్వాలని అరకులోయ శాసన సభ్యులు చెట్టి పాల్గుణ పిలుపునిచ్చారు. ఎంతో అవసరమైతేనే బయటకు రావాలని మనమందరం ఎంతో సంయమనం పాటించి అధికారులకు సహకరించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలన్నారు. అనంతరం అరకు ఎమ్మెల్యే కరోనా వైరస్ ప్లకార్డులు పట్టుకుని పురవీధులలో తిరుగుతూ ప్రజలను చైతన్య పరిచారు. నిత్యావసరాలను వైద్య సదుపాయాలను ఏజెన్సీ వాసులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు.