మధ్యాహ్నం 2 దాకే బ్యాంకులు

ABN , First Publish Date - 2020-03-24T09:45:02+05:30 IST

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఈ నెల 31వరకు బ్యాంకు పనివేళల్లో మార్పులు...

మధ్యాహ్నం 2 దాకే బ్యాంకులు

ఏటీఎంల్లో నిధులకు ఢోకా ఉండదు: రాష్ట్ర బ్యాంకర్ల సమితి 

విజయవాడ, గుంటూరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఈ నెల 31వరకు బ్యాంకు పనివేళల్లో మార్పులు చేసింది. దీనిపై సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే ప్రభు త్వ, ప్రైవేటు బ్యాంకులు పనిచేస్తాయి. కొత్త ఖాతాలు తెరవడం, రుణాల మంజూరు వంటి సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. అన్ని ఏటీఎంల్లో పూర్తిగా నగదు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఏటీఎం కేంద్రాల వద్దకు గుంపులుగా వెళ్లొద్దని బ్యాంకర్ల సమితి ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది.   

Read more