మండుటెండలో కరోనాను లెక్కచేయని మద్యం ప్రియులు

ABN , First Publish Date - 2020-06-19T23:25:22+05:30 IST

మందు ముందు మండుటెండ బాధించలేదు. ధర అమాంతం పెరిగినా వెనక్కి తగ్గలేదు. గంటల తరబడి నిరీక్షించినా ఓపిక నశించలేదు... ఇదీ మద్యం దుకాణాల వద్ద మందుబాబుల తీరు.

మండుటెండలో కరోనాను లెక్కచేయని మద్యం ప్రియులు

ఒంగోలు: మందు ముందు మండుటెండ బాధించలేదు. ధర అమాంతం పెరిగినా వెనక్కి తగ్గలేదు. గంటల తరబడి నిరీక్షించినా ఓపిక నశించలేదు... ఇదీ మద్యం దుకాణాల వద్ద మందుబాబుల తీరు. ఒంగోలులో మద్యం ప్రియులు సోషల్ డిస్టెన్స్‌ను మర్చిపోయారు. మద్యం షాపుల ముందు బారులు తీరారు. సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క కరోనా జిల్లాను వణికిస్తోంది. ఆందోళన కలిగించే రీతిలో రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. ఏరోజు కారోజు పాజిటివ్‌లు పెరగటమే కాని తగ్గుముఖం పట్టటం లేదు. అయినా  మందు ప్రియులకు ఏ మాత్రం పట్టడం లేదు. కరోనా తమ వరకు రాదనే ధీమాలో పోటీ పడి మీరి మద్యం కోసం వెంపర్లాడుతున్నారు. మద్యం కోసం వచ్చిన వారిలో రోజువారి కూలీలు, శ్రమజీవులే అధికంగా కనిపించడం గమనార్హం. బారులుదీరిన మందుబాబులను నియంత్రించడంలో అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్‌ సిబ్బంది ఫెయిలవుతున్నారని పలు విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2020-06-19T23:25:22+05:30 IST