వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కరోనా

ABN , First Publish Date - 2020-06-25T21:36:56+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కరోనా

వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కరోనా

ప్రకాశం: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు మనవడు అన్న గౌతమ్ (7)కు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే అన్న కారు డ్రైవర్, అతని వద్ద పనిచేస్తున్న అటెండర్‌కి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్య అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-06-25T21:36:56+05:30 IST