-
-
Home » Andhra Pradesh » CORONA INFECTION NOT WITH NEWSPAPERS SAYS DOCTOR SAMARAM
-
వార్తాపత్రికలతో కరోనా వ్యాపించదు: డాక్టర్ సమరం
ABN , First Publish Date - 2020-03-25T09:30:31+05:30 IST
వార్తాపత్రికలతో కరోనా వైరస్ వస్తుందన్నది ఈ శతాబ్దపు పెద్ద జోక్‌గా డాక్టర్ సమరం అభివర్ణించారు. ఈ ప్రచారంలో వాస్తవం...

విజయవాడ, మార్చి 24(ఆంధ్రజ్యోతి): వార్తాపత్రికలతో కరోనా వైరస్ వస్తుందన్నది ఈ శతాబ్దపు పెద్ద జోక్‌గా డాక్టర్ సమరం అభివర్ణించారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’తో మాట్లాడారు. ‘రోజూ మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు.. నిత్యావసరాలు తెచ్చుకుంటే.. దానివల్ల కూడా కరోనా రావాలి కదా! కరోనా మనుషుల ద్వారానే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. వాస్తవాలు చెప్పడం.. ప్రజలను అప్రమత్తం చేయడం మీడియా ద్వారానే సాధ్యం. సోషల్ మీడియాలో పుకార్లను నమ్మితే దేశం అల్లకల్లోలం అవుతుంద’ని హెచ్చరించారు. కరోనాపై అవగాహన కల్పించడంలో పత్రికలే కీలక పాత్ర పోషించాలన్నారు.