కరోనా బాధితుల వద్ద అధిక ఫీజుల వసూలుపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-10-19T19:55:37+05:30 IST

అమరావతి: కోవిడ్ ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా బాధితుల వద్ద అధిక ఫీజుల వసూలుపై

కరోనా బాధితుల వద్ద అధిక ఫీజుల వసూలుపై హైకోర్టులో విచారణ

అమరావతి: కోవిడ్ ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా బాధితుల వద్ద అధిక ఫీజుల వసూలుపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాలలో పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ ఏమేమి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నామని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నావోలు సుధాకర్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-10-19T19:55:37+05:30 IST