ఒకే స్కూల్లో 13 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-12-19T08:00:17+05:30 IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 69,062 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 458 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఒకే స్కూల్లో 13 మందికి కరోనా

కర్నూలులో వారం 

రోజులపాటు పాఠశాల బంద్‌

458 కేసులు.. ఒకరు మృతి

కర్నూలులో 14 మంది విద్యార్థులకు పాజిటివ్‌


అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 69,062 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 458 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,77,806కి చేరింది. కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,070కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,377 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 13, విజయనగరంలో 19, కడపలో 18, గుంటూరులో 41, తూర్పుగోదావరిలో 54, చిత్తూరులో 98 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


కాగా, కర్నూలు జిల్లా రుద్రవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారం రోజుల పాటు ఈ పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో సాయిరాం తెలిపారు. అదేవిధంగా రుద్రవరం కేజీబీవీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న ఒక విద్యార్థిలోనూ కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. 

Updated Date - 2020-12-19T08:00:17+05:30 IST