నెల్లూరు జిల్లాలో కరోనా ఫైట్

ABN , First Publish Date - 2020-04-05T23:17:55+05:30 IST

కరోనా వైరస్ జిల్లాలోని రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. కరోనాను నివారించేందుకు స్థానికులు ఒక గ్రామంలో..

నెల్లూరు జిల్లాలో కరోనా ఫైట్

నెల్లూరు: కరోనా వైరస్ జిల్లాలోని రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. కరోనాను నివారించేందుకు స్థానికులు ఒక గ్రామంలో కంచె ఏర్పాటు చేశారు. అయితే కంచె ఏర్పాటుతో రెండో గ్రామంలోకి వెళ్లేందుకు దారి లేదు. దీంతో రెండు గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ తలెత్తింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. 


కాగా జిల్లాలో ఒక్కరోజు వ్యవధిలోనే 29 కేసులో నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు మొత్తం 32 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 71 మంది శాంపిల్స్ పరీక్షలకు పంపారు. రెడ్ జోన్ పరిధిలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా.. ఇళ్లవద్దకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. కరోనా బాధితుల కోసం జిల్లాలో సుమారు 2వేల బెడ్‌లు సిద్ధం చేశారు. 


Updated Date - 2020-04-05T23:17:55+05:30 IST