ప్రాణం తీసిన కొవిడ్ భయం
ABN , First Publish Date - 2020-08-16T13:02:18+05:30 IST
తిరుపతి- కరకం బాడి రోడ్డులోని వినాయకసాగర్ సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో

తిరుపతి : తిరుపతి- కరకం బాడి రోడ్డులోని వినాయకసాగర్ సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో భయం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఓ కుటుంబంలో జలుబు, జ్వరంతో బాధపడుతూ తండ్రీ కొడుకులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. శనివారం బయటికి వెళ్లిన వీరు ఇంటికి వచ్చేందుకు అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని లిఫ్ట్‌లోకి ప్రవేశించారు. కొడుకు లిఫ్ట్ తలుపులు వేస్తుండగా.. సెల్‌ఫోన్‌కు కరోనా పాజిటివ్ మెసేజీ వచ్చింది. దీనిని చదువుతూ ఆయన తండ్రి (67) భయాందోళనకు గురై గుండెపోటుతో లిఫ్ట్‌లోనే తూలిపోయారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఇక పాజిటివ్ వచ్చిన కొడుకును క్వారంటైన్‌కు తరలించారు.