కరోనా ఎఫెక్ట్... వైసీపీ కార్యాలయం మూసివేత
ABN , First Publish Date - 2020-07-20T01:36:51+05:30 IST
వైసీపీ కార్యాలయాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. రాజమండ్రి నగరంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో నగర వైసీపీ కార్యాలయాన్ని

రాజమండ్రి: వైసీపీ కార్యాలయాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. రాజమండ్రి నగరంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో నగర వైసీపీ కార్యాలయాన్ని వారం రోజులపాటు మూసి వేయాలని సిటీ వైసీపీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం నిర్ణయం తీసుకున్నారు. అయితే తాత్కాలికంగా కార్యాలయాన్ని మూసివేసినప్పటికీ ఫోన్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంటామని ఆయన ప్రకటించారు.
తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్ భీకర రూపం దాల్చింది. మహమ్మారి కనివినీ ఎరుగని రీతిలో తూర్పు గోదావరిపై విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో శనివారం ఒక్కరోజులోనే 1,132 పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. కొవిడ్ ప్రభావం మార్చిలో మొదలవగా ఇంతవరకు మన రాష్ట్రంలో ఎక్కడా ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవలేదు. ఆదివారం తూర్పుగోదావరిలో జిల్లాలో 647 కేసులు, 10 మరణాలు సంభవించాయి.