కరోనా టెన్షన్... ఇంటి నుంచి పారిపోయిన వ్యక్తి

ABN , First Publish Date - 2020-07-10T23:50:45+05:30 IST

కరోనా టెన్షన్‌తో ఓ వ్యక్తి ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటన నగరంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బెజవాడ పటమట పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకెళితే..

కరోనా టెన్షన్... ఇంటి నుంచి పారిపోయిన వ్యక్తి

విజయవాడ: కరోనా టెన్షన్‌తో ఓ వ్యక్తి ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటన నగరంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బెజవాడ పటమట పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకెళితే.. నగరానికి చెందిన శ్రీనివాసరావు వారం రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా టెస్టులు చేయించుకున్నాడు. అయితే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నప్పటి నుంచి శ్రీనివాసరావు కనిపించకుండా పోయాడు. టెస్టు రిపోర్టులో అతనికి కరోనా నెగిటీవ్ అని తేలింది. టెస్టుల్లో తనకు పాజిటివ్ వస్తుందేమో అన్న భయంతోనే శ్రీనివాసరావు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసరావు మిస్సింగ్‌పై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాసరావు కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2020-07-10T23:50:45+05:30 IST