-
-
Home » Andhra Pradesh » corona effect corruption tdp leader devineni asked ap govt
-
కరోనా కట్టడి చర్యల్లో కూడా అవినీతా?: దేవినేని
ABN , First Publish Date - 2020-05-14T00:05:23+05:30 IST
కరోనా కట్టడి చర్యల్లో కూడా అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేసిన

విజయవాడ: కరోనా కట్టడి చర్యల్లో కూడా అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. ఓ మీడియా ప్రసారం చేసిన కథనాన్ని కోట్ చేస్తూ ప్రభుత్వ అవినీతిని తూర్పారబ్టటారు. క్వారంటైన్ వసతుల్లో, భోజన సదుపాయాల్లో వైసీపీ నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. బ్లీచింగ్ ఫౌడరులో సున్నం కలపడం ఏంటని నిలదీశారు. టెండర్లు లేకుండా కోట్ల రూపాయల కుంభకోణం చేసిన ఫ్యాక్టరీ ఎవరిదని దేవినేని ఉమ ప్రశ్నించారు. వీటిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పండని ప్రభుత్వాన్ని దేవినేని డిమాండ్ చేశారు.