-
-
Home » Andhra Pradesh » corona effect andhrapradesh telangana
-
కరోనా ఎఫెక్ట్.. తెలంగాణ నుంచి ఏపీలోకి నో ఎంట్రీ
ABN , First Publish Date - 2020-03-26T04:31:45+05:30 IST
జగ్గయ్యపేట సరిహద్దు దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణ నుంచి వచ్చిన వారిని పోలీసులు ఏపీలోకి అనుమతించడంలేదు. ఎన్‌ఓసీ తీసుకుని..

కృష్ణా: జగ్గయ్యపేట సరిహద్దు దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణ నుంచి వచ్చిన వారిని పోలీసులు ఏపీలోకి అనుమతించడంలేదు. ఎన్‌ఓసీ తీసుకుని వచ్చినా అనుమతి నిరాకరిస్తున్నారు. ఉన్నతాధికారుల అనుమతి కావాలని, వైద్య పరీక్షల తర్వాతే స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తామని ఏపీ పోలీసులు చెబుతున్నారు. అందరినీ క్వారంటైన్ చేస్తామని చెప్పడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తాగేందుకు కనీసం మంచినీళ్లు కూడా లేవంటూ ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.