పలాస ఘటనలో మున్సిపల్‌ కమిషనర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

ABN , First Publish Date - 2020-06-27T03:55:02+05:30 IST

శ్రీకాకుళం జిల్లా పలాసలో కోవిడ్‌ కారణంగా మరణించిన వ్యక్తిని అంత్యక్రియలు విషయంలో అమానవీయంగా వ్యవహరించిన ఘటన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో సీఎంఓ అధికారులు మాట్లాడి ఘటన

పలాస ఘటనలో మున్సిపల్‌ కమిషనర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

అమరావతి: శ్రీకాకుళం జిల్లా పలాసలో కోవిడ్‌ కారణంగా మరణించిన వ్యక్తిని అంత్యక్రియలు విషయంలో అమానవీయంగా వ్యవహరించిన ఘటన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో సీఎంఓ అధికారులు మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉన్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించి పొక్లెయిన్‌ద్వారా మృతదేహాన్ని తరలించడం అమానవీయమని స్పష్టంచేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు విచారణ జరిపిన జిల్లా కలెక్టర్‌ నివాస్, పలాస మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాజీవ్‌ను సస్పెండ్‌చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ సోకిన వారి విషయంలో వివక్ష లేకుండా, అమానవీయ చర్యలకు దిగకుండా వైద్యారోగ్యశాఖ ఇదివరకే స్పష్టమైన నిబంధనలను జారీచేసిందని ఈసందర్భంగా ప్రభుత్వం మరోసారి గుర్తుచేసింది.

Updated Date - 2020-06-27T03:55:02+05:30 IST