‘కరోనా’ విధుల్లోని అందరికీ జీతాలివ్వాలి
ABN , First Publish Date - 2020-04-05T08:38:31+05:30 IST
వైద్య సిబ్బంది మాదిరిగానే రాష్ట్రం లో కరోనా నియంత్రణ డ్యూటీలో ఉన్న అందరికీ పూర్తి జీతాలు ఇవ్వాలని యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ సాబ్జీ, పి.బాబురెడ్డి ప్ర భుత్వాన్ని కోరారు. వైద్యులతోపాటు

అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): వైద్య సిబ్బంది మాదిరిగానే రాష్ట్రం లో కరోనా నియంత్రణ డ్యూటీలో ఉన్న అందరికీ పూర్తి జీతాలు ఇవ్వాలని యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ సాబ్జీ, పి.బాబురెడ్డి ప్ర భుత్వాన్ని కోరారు. వైద్యులతోపాటు కరోనా విధుల్లో పాలుపంచుకుంటున్న మున్సిపల్ ఉపాధ్యాయులకు, పీఈటీలకు, పీడీలకు, సెకండరీ గ్రేడ్ టీచర్ల కు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, గ్రామ సచివాలయ వలంటీర్ల కు పూర్తి జీతాలు చెల్లించాలని కోరుతూ సీఎంకు లేఖ రాశారు.