నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం..

ABN , First Publish Date - 2020-04-05T16:24:31+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే 29 కేసులో నమోదు కావడం..

నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం..

నెల్లూరు: జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే 29 కేసులో నమోదు కావడం కలకలం రేపుతోంది. మరో 71 మంది శాంపిల్స్ పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందని, అందరికీ పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామని కలెక్టర్ శేషగిరిబాబు చెప్పారు. రెడ్ జోన్ పరిధిలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా.. ఇళ్లవద్దకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా శేషగిరిరావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రోగుల కోసం జిల్లాలో సుమారు 2వేల బెడ్‌లు సిద్ధం చేశామన్నారు. ఇప్పటి వరకు 32 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. మరి కొన్ని కేసులకు సంబంధించి నివేదిక రావాల్సి ఉందన్నారు.


లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయడం కోసం ప్రజలు సహకరించాలని కలెక్టర్ శేషగిరిబాబు కోరారు. ఇప్పుడు జిల్లాలో కర్ఫ్యూను ఒక గంట తగ్గించామని, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ప్రజలు నిత్యావసర సరుకులు కోనుగోలు చేసుకోవాలని ఆయన సూచించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిషేధించామని చెప్పారు. ఏప్రిల్ 14 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని, అందుకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని శేషగిరిబాబు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-04-05T16:24:31+05:30 IST