బాపట్లలో దారుణం.. రిక్షాలో కోవిడ్ బాధితుడి మృతదేహం

ABN , First Publish Date - 2020-08-13T02:57:16+05:30 IST

జిల్లాలోని బాపట్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓవైపు కరోనా జనం గజగజ వణికిపోతుంటే.. అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కరోనాతో చనిపోయిన వృద్ధుడి మృతదేహాన్ని రిక్షాలో

బాపట్లలో దారుణం.. రిక్షాలో కోవిడ్ బాధితుడి మృతదేహం

గుంటూరు: జిల్లాలోని బాపట్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓవైపు కరోనా కారణంగా జనం గజగజ వణికిపోతుంటే.. అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కరోనాతో చనిపోయిన వృద్ధుడి మృతదేహాన్ని రిక్షాలో తరలించారు. కనీసం కోవిడ్ నిబంధనల ప్రకారం ప్యాకింగ్ చేయకుండా మృతదేహాన్ని తరలించారు. మృతదేహం తరలింపునకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడయాలో వైరల్ అయ్యాయి. అవి కాస్తా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దృష్టికి చేరింది. దీంతో అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యమా అంటూ మండిపడ్డారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - 2020-08-13T02:57:16+05:30 IST