కరోనా మృతదేహాలపై ప్రజల ఆందోళన

ABN , First Publish Date - 2020-04-26T22:48:04+05:30 IST

కరోనా మృతదేహాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వేగంగా విస్తరిస్తున్నా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. కర్నూలు శివారులో రాత్రికి రాత్రే మృతదేహాలను అధికారులు

కరోనా మృతదేహాలపై ప్రజల ఆందోళన

కర్నూలు: కరోనా మృతదేహాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వేగంగా విస్తరిస్తున్నా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. కర్నూలు శివారులో రాత్రికి రాత్రే మృతదేహాలను అధికారులు పూడ్చివేస్తున్నారు. పూడ్చిన మట్టిపై బ్లీచింగ్‌పౌడర్‌ చల్లి, పీపీఈ కిట్లను తగులబెట్టకుండానే రోడ్డు మీద పడేసి సిబ్బంది వెళ్లారు. నాలుగు కరోనా మృతదేహాలను తమ ఊరి వద్ద ఖననం చేస్తున్నారని మూడు గ్రామాల ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను దహనం చేయకుండా పూడ్చిపెట్టడంపై గ్రామస్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-04-26T22:48:04+05:30 IST