దీప కాంతులతో వెలిగిన విశాఖ శారదాపీఠం

ABN , First Publish Date - 2020-04-06T03:56:41+05:30 IST

శారదాపీఠం ప్రాంగణం దీప కాంతులతో వెలిగిపోయింది. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఐక్యతను చాటే కార్యక్రమంలో..

దీప కాంతులతో వెలిగిన విశాఖ శారదాపీఠం

విశాఖ: శారదాపీఠం ప్రాంగణం దీప కాంతులతో వెలిగిపోయింది. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఐక్యతను చాటే కార్యక్రమంలో భాగంగా శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర జ్యోతిని వెలిగించారు. పీఠానికి చెందిన వేద విద్యార్థులంతా జ్యోతులను వెలిగించి కాగడాలను ప్రదర్శించారు. పీఠం ఆవరణలో దీపాలను వెలిగించారు.


ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన పీఠం స్వామి స్వాత్మానందేంద్ర హైందవ సంప్రదాయంలో దీపానికున్న ప్రాధాన్యతను వివరించారు. కరోనా సృష్టించిన చీకటిని పారద్రోలి వెలుగులు నింపడానికి ఈ కార్యక్రమం నాంది పలుకుతుందన్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వాలు జారీచేసే సూచనలను అంతా విధిగా పాటించాలని కోరారు

Updated Date - 2020-04-06T03:56:41+05:30 IST