వైద్యుల ఇసుక శిల్పంతో కొత్త ప్రయోగం

ABN , First Publish Date - 2020-04-09T00:49:02+05:30 IST

భారతదేశంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో వ్యాధి సోకిన వారికి ఆస్పత్రిలో సేవలు అందిస్తున్న వైద్యులు భూలోక దేవుళ్లు అంటూ ..

వైద్యుల ఇసుక శిల్పంతో కొత్త ప్రయోగం

నెల్లూరు: భారతదేశంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో వ్యాధి సోకిన వారికి ఆస్పత్రిలో సేవలు అందిస్తున్న వైద్యులు భూలోక దేవుళ్లు అంటూ చిళ్లకూరు మండలం ఏరూరుకు చెందిన సైకత శిల్పి మంచాల శరత్ కుమార్ సాగర తీరంలో హాట్సాఫ్ టు డాక్టర్స్ కోవిడ్19 వారియర్ అంటూ సైకత శిల్పాన్ని తయారు చేసి వైద్యుల సేవలకు అభినందనలు తెలిపారు. కుటుంబ సభ్యులకు దూరంగా ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడి సేవలందిస్తున్న డాక్టర్లు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న యోధులుగా వర్ణించి భూలోక దేవుళ్లు వైద్యులుగా సైకత శిల్పం ద్వారా శరత్ కుమార్ అభినందనలు తెలిపారు.  

Updated Date - 2020-04-09T00:49:02+05:30 IST