ఏపీలో 405కు చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-12T19:11:05+05:30 IST

ఏపీలో కొత్తగా 24 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో 405కు చేరిన కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కొత్తగా 24 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో గుంటూరులో 17, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. కొత్తగా పాజిటీవ్ నిర్ధారణ అయినవారిలో 17 మంది గుంటూరు నగరానికి చెందినవారే. అందులో 11 మంది ఒకే కుటుంబానికి చెందనవారు. ఇందులో పదేళ్లలోపు చిన్నారులు ఆరుగురు ఉన్నారు. ఇదే కుంటుంబంలో ఇద్దరు మహిళలకు ప్రాణంతకవ్యాధి సోకింది. నగరంలో రెడ్ జోన్ ప్రాంతంగా గుర్తించిన ఓ వీథిలో ఇప్పటికే 22 మందికి కరోనా నిర్ణారణ కావడంతో అక్కడ నివశించేవారు కూడా భయపడుతున్నారు.


Updated Date - 2020-04-12T19:11:05+05:30 IST