ఏపీలో 1177కు చేరిన కరోనా కేసుల సంఖ్య

ABN , First Publish Date - 2020-04-28T16:10:26+05:30 IST

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు విస్తరిస్తోంది.

ఏపీలో 1177కు చేరిన కరోనా కేసుల సంఖ్య

అమరావతి: కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు విస్తరిస్తోంది. వారం రోజుల నుంచి వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 1177కు చేరింది. విజయవాలో మూడు ప్రాంతాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కృష్ణలంక, కార్మికనగర్, కుమ్మరిపాలెంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ఆ ప్రాంతాలపై దృష్టి సారించాయి. విజయవాడలో కొందరి నిర్లక్ష్యంగానే కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. డ్యూటీపై పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన ఓ లారీ డ్రైవర్ పేకాట ఆడి 24 మందికి వైరస్‌ను అంటించాడు. ఆ 24 మంది ఎంతమందికి వైరస్‌ను వ్యాపింపజేశారో ఊహించలేని పరిస్థితి నెలకొంది.

Updated Date - 2020-04-28T16:10:26+05:30 IST