ఉత్తరాంధ్రలో పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-10T21:29:05+05:30 IST

ఉత్తరాంధ్ర జిల్లాల్లో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఉత్తరాంధ్రలో పెరుగుతున్న కరోనా కేసులు

విశాఖ: ఉత్తరాంధ్ర (విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం) జిల్లాల్లో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కోవిడ్ ఆస్పత్రులతో పాటు హోంమైగ్రేషన్ విధానాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు. కొన్నిచోట్ల ఆస్పత్రుల్లో ఏర్పాట్లు సరిగా లేవనే ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ సుధాకర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కేసులు క్రమేణ పెరగడం ఊహించని పరిణమామని అన్నారు. అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు సన్నద్ధమయ్యామన్నారు. బెడ్లు, కోవిడ్ కేర్ సెంటర్లు పెంచామని, హోం ఐసోలేషన్ కూడా చేస్తున్నామని సుధాకర్ చెప్పారు. అలాగే బాధితులకు ప్రతి రోజు ఫోన్లు చేసి పరిస్థితిని తెలుసుకుంటున్నామన్నారు. పరీక్షలు చేయించుకున్నవారు నెగిటివ్ వచ్చేవరకు ఎవరినీ కలవకూడదని సూచించారు. ప్రతి రోజు 2 వేలకుపైగా పరీక్షలు చేస్తున్నామని సుధాకర్ తెలిపారు.

Updated Date - 2020-07-10T21:29:05+05:30 IST