ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ కొత్తగా..

ABN , First Publish Date - 2020-04-21T17:52:11+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువైపోతున్నాయి...

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ కొత్తగా..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువైపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే ఇవాళ ఒక్కరోజే 35 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇవాళ నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 757కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. అయితే.. కరోనాతో ఇప్పటి వరకూ మొత్తం 22 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. 639 మందికి చికిత్స  కొనసాగుతుండగా.. 96 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.


ఇవాళ నమోదైన 35 కేసుల్లో కర్నూలు-10, గుంటూరు-09, కడప-06, పశ్చిమ గోదావరి- 04, కృష్ణా-03, అనంతపురం-03 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


జిల్లాల వారీగా కేసులు లెక్కలు చూస్తే...Updated Date - 2020-04-21T17:52:11+05:30 IST