కొవిడ్‌ కోరలు

ABN , First Publish Date - 2020-09-13T07:14:53+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఏకంగా ఐదు లక్షల

కొవిడ్‌ కోరలు

  • ఐదున్నర లక్షలు దాటిన పాజిటివ్‌లు
  • ఒక్కరోజే 9901 కరోనా కేసులు.. 67 మరణాలు
  • ‘తూర్పు’లో 75 వేలు దాటాయి.. కాకినాడ ఎంపీ వంగా గీతకు పాజిటివ్
  • ‌ 

అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఏకంగా ఐదు లక్షల యాభైవేలు దాటాయి. కొత్తగా 75 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9901 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆరోగ్యశాఖ బులెటిన్‌ ద్వారా వెల్లడించింది. శనివారం ఉదయం నాటికి కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 5,57,587కు చేరినట్లు పేర్కొంది. శనివారం అత్యధికంగా తూర్పుగోదావరిలో 1398 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం కేసులు 75,394కు చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కరోనాతో 67 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 4846కు చేరింది. మరోవైపు శనివారం 10,292 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 4,57,008 మంది కరోనా నుంచి బయటపడ్డారు. కాకినాడ ఎంపీ వంగా గీత కొవిడ్‌ బారిన పడ్డారు. వైరస్‌ లక్షణాలు కనిపించడంతో చేసిన వైద్య పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో ఆమె హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.


ఇదే జిల్లాకు చెందిన అనపర్తి ఎంఈవో విజయకుమారి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, అత్యధికంగా తూర్పుగోదావరిలో 1398 కేసులు నమోదవ్వగా, మొత్తం కేసులు 75,394కు చేరాయి. కృష్ణా జిల్లాలో 467 కేసులతో పాజిటివ్‌లు 20,877కి చేరాయి. నెల్లూరులో 711, కడప జిల్లాలో 792, కర్నూలు జిల్లాలో 505, గుంటూరు జిల్లాలో 479, ప్రకాశం జిల్లాలో 861, పశ్చిమ గోదావరిలో 1,069, శ్రీకాకుళం జిల్లాలో 555, విజయనగరం.. 583, అనంతపురం జిల్లాలో 680, విశాఖ జిల్లాలో 584 కేసులు కొత్తగా వచ్చాయి. చిత్తూరు జిల్లాలో కొత్తగా 934మందితోపాటు, మొత్తం కేసులు 51,397కి చేరుకున్నాయి.     

Updated Date - 2020-09-13T07:14:53+05:30 IST