ఆ రెండు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-15T19:39:22+05:30 IST

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రోజు రోజుకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఆ రెండు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

విజయవాడ: గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రోజు రోజుకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 44 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నిన్న ఒక్కరోజు 8 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కమ్యూనిటీ స్ప్రెడ్ అయిందా? అన్న దానిపై అధికారులు మల్లగుల్లలు పడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలోనే కరోనా పాజిటీవ్ కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 114 కేసులు నమోదు కాగా... ఐదుగురు మృతి చెందారు. ఇంకా మూడు వందలమంది ఫలితాలు రావాల్సి ఉంది. ప్రారంభంలో రోజుకు ఒకటి, రెండుకే పరిమితమైన జిల్లాలో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే సుమారు 90 కేసులు నమోదయినట్లు తెలియవచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-04-15T19:39:22+05:30 IST