ప్రకాశం జిల్లాలో దడ పుట్టిస్తున్న కరోనా కేసులు..

ABN , First Publish Date - 2020-07-15T13:10:40+05:30 IST

ప్రకాశం: జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ దడ పుట్టిస్తున్నాయి. తాజాగా మరో 131 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ప్రకాశం జిల్లాలో దడ పుట్టిస్తున్న కరోనా కేసులు..

ప్రకాశం: జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ దడ పుట్టిస్తున్నాయి. తాజాగా మరో 131 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 1836 కాగా... అత్యధికంగా ఒంగోలులో 27, కందుకూరు 18, పామూరు 12, చీరాలలో 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జిల్లాలో ఇప్పటి వరకు 30 మంది కరోనా కారణంగా మృతి చెందారు. జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలు లక్ష దాటాయి. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం పంపిన శ్యాంపిళ్లు 1,02,992 కాగా.. నెగిటివ్ ఫలితాలు వచ్చినవి 93,311... ఇంకా రిపోర్టులు రావాల్సినవి 7846... జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్లలో ఉన్నవారు 482... నిన్న కరోనా నుంచి కోలుకుని 64 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారు 1249 కాగా... జిల్లాలో ప్రస్తుతం 587 యాక్టివ్ కేసులున్నాయి.

Updated Date - 2020-07-15T13:10:40+05:30 IST