అరకులోయలో కరోనా కేసు నమోదు
ABN , First Publish Date - 2020-07-19T00:26:10+05:30 IST
ఇప్పటివరకు కరోనా మహమ్మారి మైదానాలకే పరిమితమైందని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు ఏజన్సీల్లో కూడా కరోనా చిచ్చుపెడుతోంది.

విశాఖ: ఇప్పటివరకు కరోనా మహమ్మారి మైదానాలకే పరిమితమైందని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు ఏజన్సీల్లో కూడా కరోనా చిచ్చుపెడుతోంది. శనివారం విశాఖ అరకు లోయలో మూడో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. 2 రోజుల క్రితం అరకులోయలో చేపల వ్యాపారం నిర్వహిస్తున్న మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విశాఖలో సదరు మహిళ పరీక్షలు చేయించుకుంది. ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో అధికారులు ఇంకా ఎవరెవరు ఉన్నారని ఆరా తీస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మహిళను వదలివేసి భర్త అరకులోయకు తిరిగి వెళ్లిపోయాడు. మహిళ నివసించే అరకు లోయలోని కొండవీది ప్రాంతాన్ని అధికారులు శానిటేషన్ చేశారు.