ఏపీలో విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-08-01T23:21:47+05:30 IST

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,276 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి

ఏపీలో విజృంభిస్తున్న కరోనా

అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,276 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి లక్షా 50 వేల 209కి కరోనా పాజిటివ్ కేసులు చేరాయి. ఏపీలో గత 24 గంటల్లో కరోనాతో 58 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1407 కరోనా మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 72,188 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు ఏపీలో కరోనా నుంచి 76,614 మంది కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 8, విశాఖ 8, గుంటూరు జిల్లాలో ఏడుగురు కరోనాతో మృతి చెందారు. అనంతపురం 6, కర్నూలు 6, చిత్తూరు జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. శ్రీకాకుళం 4, కృష్ణా 3, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. నెల్లూరు 2, ప్రకాశం 2, విజయనగరం 2, కడప జిల్లాలో ఒకరు మృతి చెందారు.

Updated Date - 2020-08-01T23:21:47+05:30 IST