ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 425 కేసుల నమోదు

ABN , First Publish Date - 2020-06-18T18:41:07+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు

ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 425 కేసుల నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 299 మందికి పాజిటివ్‌ రాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 100 మందికి.. విదేశాల నుంచి వచ్చినవారిలో 26 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 7,496కి చేరినట్లుగా హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కోవిడ్ వల్ల కృష్ణాజిల్లాలో ఇద్దరు మృతిచెందగా.. మొత్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 92 మందికి చేరింది.

Updated Date - 2020-06-18T18:41:07+05:30 IST