కరోనాపై కంటితుడుపు: యనమల

ABN , First Publish Date - 2020-04-05T09:04:24+05:30 IST

రాష్ట్రంలో పాలకుల ఉదాసీనత వల్లే రోజురోజుకు కరోనా ఉధృతి పెరుగుతుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. గత ఏడాది రూ.2,27,975కోట్ల బడ్జెట్‌లో ఎంత ఖర్చుపెట్టారని ప్రశ్నించారు.

కరోనాపై కంటితుడుపు: యనమల

అమరావతి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాలకుల ఉదాసీనత వల్లే రోజురోజుకు కరోనా ఉధృతి పెరుగుతుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. గత ఏడాది రూ.2,27,975కోట్ల బడ్జెట్‌లో ఎంత ఖర్చుపెట్టారని ప్రశ్నించారు. తొలి ఆరు నెలల్లో బడ్జెట్‌లో 35శాతం కూడా ఖర్చుచేయలేదన్నారు. ఇంకా 65శాతం నిధులు మీ వద్దే ఉంటే ఉద్యోగుల జీతాల్లో కోతలు ఎందుకని నిలదీశారు. కరోనా నిరోధానికి నిధులు ఎందుకివ్వరని, డాక్టర్లు, సిబ్బందికి మాస్క్‌లు ఎందుకు కొనరని యనమల ప్రశ్నించారు.

Updated Date - 2020-04-05T09:04:24+05:30 IST