భవనం పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-10-24T19:10:19+05:30 IST
భవనం పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య

పశ్చిమగోదావరి: జిల్లాలోని ఏలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా పేషెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆశ్రం ఆస్పత్రి భవనం పైనుంచి దూకాడు. మృతుడు వంగాయిగూడెంకు చెందిన లంకపల్లి రంగారావు (45)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కరోనా పేషెంట్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.