అంతర్వేది రథం దగ్ధం ఘటన బందోబస్తు డ్యూటీలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-09-14T01:52:54+05:30 IST

అంతర్వేది రథం దగ్ధం ఘటన బందోబస్తు డ్యూటీలో కరోనా కలకలం

అంతర్వేది రథం దగ్ధం ఘటన బందోబస్తు డ్యూటీలో కరోనా కలకలం

తూర్పుగోదావరి: అంతర్వేది రథం దగ్ధం ఘటన బందోబస్తు డ్యూటీలో కరోనా కలకలం రేగింది.ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న జిల్లా ఎస్పీ నయీమ్ అద్నాన్ హస్మి, అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, రాజోలు సిఐ దుర్గాశేఖర్ రెడ్డి, ఐదుగురు ఎస్సైలు సహా పలువురు పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని క్వారంటైన్‌కు తరలించారు. ధార్మిక సంఘాల ఆందోళనలో రాజోలు సిఐ దుర్గాశేఖర్ రెడ్డి సహా ఐదుగురు ఎస్సైలు విధులు నిర్వహించారు. అలాగే పోలీసు సిబ్బంది, ధార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన  తోపులాటలో కూడా సిఐ, ఎస్సైలు ఉన్నారు. 

Updated Date - 2020-09-14T01:52:54+05:30 IST