వైసీపీ నేతల తీరుతో వివాదం

ABN , First Publish Date - 2020-03-12T10:44:23+05:30 IST

విజయనగరం జిల్లా జామి మండలంలో చివరిరోజు బుధవారం ఎక్కువమంది అభ్యర్థులు ఎంపీటీసీ నామినేషన్లు వేసేందుకు

వైసీపీ నేతల తీరుతో వివాదం

విజయనగరం, మార్చి 11(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా జామి మండలంలో చివరిరోజు బుధవారం ఎక్కువమంది అభ్యర్థులు ఎంపీటీసీ నామినేషన్లు వేసేందుకు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. పోలీసులు ఒక్కో అభ్యర్థిని, ఇద్దరు మద్దతుదార్లను మాత్రమే విడిచి పెడుతున్నారు. వైసీపీ అభ్యర్థి వెంట ఇద్దరు వెళ్తూ 10మంది నామినేషన్లను తీసుకెళ్లారు. ఆ తర్వాత మిగతా వైసీపీ అభ్యర్థులు, మద్దతుదారులు ఒక్కొక్కరుగా వెళ్లారు. తమకు అవకాశం రావటం లేదని టీడీపీ అభ్యర్థులు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు పంపించారు.

Updated Date - 2020-03-12T10:44:23+05:30 IST