చిత్తూరులో కరోనా నియంత్రణకు చర్యలు: ఓబులేసు
ABN , First Publish Date - 2020-04-08T17:20:21+05:30 IST
చిత్తూరులో కరోనా వైరస్ నియంత్రణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని..

చిత్తూరులో కరోనా వైరస్ నియంత్రణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వలస కూలీలకు అవసరమైన నిత్యావసర వస్తువులను సమకూర్చుతున్నామని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా పరిశుభ్రత పరంగా ఎప్పటికప్పుడు వినూత్న చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిత్తూరులో రోజు క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తున్నామన్నారు. ప్రజలకు కూడా కరోనా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయన్నదానిపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రతి ఇంటికి వాలంటీర్స్ వెళ్లి సర్వే చేస్తున్నారని, కరోనా లక్షణాలతో ఎవరైనా బాధపడుతుంటే.. డాక్టర్ వెళ్లి పరిశీలించి.. అవసరమనుకుంటే ప్రభుత్వ ఆస్పత్రికి పంపడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు.