అవినీతికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

ABN , First Publish Date - 2020-05-13T22:30:39+05:30 IST

అవినీతికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

అవినీతికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

కృష్ణాజిల్లా: అవినీతికి పాల్పడుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎస్పీ సీరియస్ అయ్యారు. జిల్లాలో తిరువూరు సర్కిళ్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గంపలగూడెం పీఎస్ కు చెందిన జె.నాగమల్లేశ్వర రావు అక్రమ మద్యం వ్యక్తుల వద్ద నుంచి డబ్బుల డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విసన్నపేట పీఎస్ కు చెందిన జి.అజయ్ చెక్ పోస్ట్ ల వద్ద పాస్ లేని వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు.

Read more