మానవత్వం చాటిన కానిస్టేబుల్‌!

ABN , First Publish Date - 2020-12-25T09:14:48+05:30 IST

మానవత్వం చాటిన కానిస్టేబుల్‌!

మానవత్వం చాటిన కానిస్టేబుల్‌!

తిరుమల: తిరుమల పాదయాత్రలో సొమ్మసిల్లిపడిపోయిన మహిళను ఈ పోలీసు అడవిలో ఏకంగా ఆరు కిలోమీటర్లు భుజాలపై మోశారు. కడప జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి తిరుమలకు పాదయాత్రగా వచ్చారు. నందలూరి మండలానికి చెందిన నాగేశ్వరమ్మ అనే మహిళ కూడా వీరితో బయలుదేరారు. మంగళవారం సాయంత్రం తిరుమల అన్నమయ్య కాలినడక మార్గంలో గుర్రపు పాదం వద్దకు రాగానే బీపీ ఎక్కువై ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. విధుల్లో ఉన్న కడప స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌ అర్షద్‌.. అది గమనించారు. మానవత్వంతో స్పందించి సకాలంలో ఆస్పత్రిలో చేర్చి ఆమె ప్రాణాలు కాపాడారు.     

Updated Date - 2020-12-25T09:14:48+05:30 IST