స్థానికంలో ఏకగ్రీవాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-07T09:18:25+05:30 IST

‘మొత్తం 8 వేల ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికల్లో 2 వేలు ఏకగ్రీవం. వైసీపీకి 20 శాతం ఈ ఎలక్షన్‌ కమిషనర్‌ ఏకగ్రీవం ఎలా చేశారు..

స్థానికంలో ఏకగ్రీవాలను రద్దు చేయాలి

మొత్తం ఎన్నికలను తిరిగి జరపాలి: సోము వీర్రాజు


రాజమహేంద్రవరం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘‘మొత్తం 8 వేల ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికల్లో 2 వేలు ఏకగ్రీవం. వైసీపీకి 20 శాతం ఈ ఎలక్షన్‌ కమిషనర్‌ ఏకగ్రీవం ఎలా చేశారు? ఇతరులను ఎవరినీ నామినేషన్లు దాఖలు చేయనీయకుండా జరిపించుకొన్న ఎన్నికలను రద్దు చేయాలి. తిరిగి మొత్తం ఎన్నికలు నిర్వహించాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక, హైదరాబాద్‌ ఫలితాలే ఏపీలో కూడా వస్తాయని అన్నారు. తిరుపతిలో కూడా గట్టి పోటీ ఇచ్చి విజయం దిశగా వెళతామన్నారు. 2024లో బీజేపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందన్నారు. ‘‘కేంద్రం 24 లక్షలు ఇళ్లు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం 17 లక్షలే తీసుకుంటోంది. 7 లక్షలు వెనక్కి పోయాయి. అభివృద్ధి అంటే ఇదా? చంద్రబాబు 5 లక్షల ఇళ్లు కట్టారు. జల మిషన్‌లో 79 లక్షల కుళాయిలు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం 39 లక్షలే ఇచ్చింది’’ అని చెప్పారు.

Updated Date - 2020-12-07T09:18:25+05:30 IST