వామపక్షాల నిరసనకు కాంగ్రెస్ మద్దతు: శైలజానాథ్

ABN , First Publish Date - 2020-09-25T02:33:49+05:30 IST

శుక్రవారం వ్యవసాయ అనుబంధ బిల్లులకు వ్యతిరేకంగా వామపక్షాల నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ నేత శైలజానాథ్ ప్రకటించారు.

వామపక్షాల నిరసనకు కాంగ్రెస్ మద్దతు: శైలజానాథ్

అమరావతి: శుక్రవారం వ్యవసాయ అనుబంధ బిల్లులకు వ్యతిరేకంగా వామపక్షాల నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ నేత శైలజానాథ్ ప్రకటించారు. ఈ బిల్లులను ఏన్డీఏ భాగస్వామ్య పక్షాలు వ్యతిరేకిస్తున్నా మొండిగా బీజేపీ ముందుకు వెళ్లడం మూర్ఖత్వమన్నారు. రైతులను కార్పొరేట్ శక్తుల చేతిలోకి తోసే ఈ బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకూ కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని శైలజానాథ్ ప్రకటించారు.

Updated Date - 2020-09-25T02:33:49+05:30 IST